మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

9, అక్టోబర్ 2010, శనివారం

వెస్ట్ బెంగాల్ - పాపాయి


ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు అమ్మాయిలకి అమెరికాసంబంధాలు తప్ప మిగిలిన దిక్కులు చూట్టం మానుకున్నారు .అమెరికా ఎట్లా ఉంటుందో ..నేను చూడలేదు గనుక ఎట్లా అనుకుంటానంటే అచ్చం సినిమలోల్లా ఉంటుందేమోనని . కనీసం భారత దేశం కంటే పాతిక, ఏబై ఏళ్ళు ముందు ఉండవచ్చని అంటే అంత ఆధునికంగానన్న మాట .మా ఊళ్ళో వాళ్ళు కోతలకి,నాట్లకి కూలోళ్లు దొరక్కున్నా, సంక్రాంతికి అరిసెల పిండి దంచేందుకు మనుషులు రాక పోగా" సుద్దంగా మిషన్లో ఆడించుకోక ఎందుకొచ్చిందని "ఎదురు సలహా ఇచ్చినపుడు...మనూరిప్పుడు అమెరికా అయిపొయింది అనుకుంటుంటారు .ఇంకా కొందరు మనూరి ముందు అమెరికా ఎక్కడ నూకద్దసలూ అని కూడా అంటుంటారు .అనే వాళ్ళెవ్వరూ అమెరికా చూడ లేదులెండి నాలాగే ...కాకపోతే మా అందరి ఊహా అదేనన్న మాట .
ఇట్లా చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని రెక్కలు కట్టుకుని యాబయ్ఏళ్ళ కాలం ముందుకు వెళుతుంటే నేనేమో అదేదో సినిమాలోలా పాతికేళ్ళ కాలం వెనక్కోచ్చేసా.ఇక్కడ ఇంకా మనుషులు లాగే రిక్షా లున్నాయ్ .ఊరికి పుట్టెడు చెరువులూ ,చెరువుల్లో స్నానమాడే స్త్రీలు ,గంటల తరబడీ గాలం వేసి చెరువు వొడ్డున కూర్చునే సంసారులూ ఉన్నారు .ఇంకా కూలి కోసం మనుషులంటార, కొల్లలు .ఇక్కడే కాదు వీరు ఇప్పుడు మన లాటి సంపన్న రాష్ట్రాలకూ తరలి వస్తున్నారు .మన వాళ్ళు దుబాయ్ కి వెలతారే అట్లాగా .ఇదొక్కటేనా వీళ్ళ ఘనత అమాయకపు బడి పిల్లల్ని ఎక్కడో మాటు వేసి పట్టికెళ్ళి అమ్మేస్తారు .తెల్ల తోలు ఉంటుంది చాల మందికి అదృష్టం అలా కలిసి వస్తుందన్న మాట .రోజు కూడు తప్ప మరే ఆశ లేని నిర్భాగ్య సంసారాలు బోలేడున్నాయ్ .తినే తిండే ప్రథమ ఆశ ఏంటి అంతా నెగెటివ్ పాసిటివ్ ఏమీ లేదా అనుకుంటున్నారా లేకేం బోలెడు మీకు వెనకటి రోజుల గురించి నాష్టాల్జియా ఏమయినా ఉంటె ఇటో సారి ట్రిప్ వెయ్యొచ్చు .అంతేనా రవీంద్రుడు రాసిన ప్రకృతిని ఇప్పటికి మీ కెమెరాలతో కేచ్ చెయ్యొచ్చు
అసలు విషయం చెప్పేద. ఇంకా ప్రభుత్వ పాట శాలలు గుంపులు గుంపులు పిల్లలతో అలరారు తుంటై .మన వాళ్ళు కృషి చేస్తున్న మాతృ భాషా ఉద్యమాల వంటి ఉద్యమాల గ్రహచారం వీళ్ళకు లేదు .ఇంగ్లీస్ష్ మీడియం స్కూళ్ళు అక్కడోటీ ఇక్కడొకటి ఉంటాయంతే .అది కూడా టౌన్ లలోనే .ఇంకో మాటేమంటే గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఇక్కడ ఇంకా అలరారడం చేత టౌన్ లు కూడా గ్రామాల లాగే ఉంటాయ్ .కాబట్టి సబ్ డివిజన్ లలో ఆంగ్ల పాట శాలల గురించి అసలేం ఆశ పెట్టుకోకండి .కనుక వీరికి వీరి దేశమే స్వర్గం . వీరి రాష్ట్రాన్ని ఇంత సుందరంగా వెనక్కి నడిపింది ఎవరనుకుంటారు .ముప్పయ్యేళ్ళు పరిపాలించిన కమ్యునిష్టులు .ఒక ఐదేళ్ళు తక్కువ పాతికేళ్ళు వెనకబడిందని ఎందుకన్నానంటే మరి చెప్పండి వారి దారిలోకి అంత మేధావులైన ప్రజల్ని తీసుకు రావాలంటే కనీసం ఐదేళ్లయ్నా పట్టదేమిటి .కనుక ఇక్కడ ఆగి చెప్పెయ్యండి " లాల్ సలాం "
ఇటువంటి ప్రదేశం లో బిడ్డ చదువెలా అని మన తెలుగు దేశం నుండి వచ్చిన ఎవరికైనా దిగులేస్తుంది కదా .నాక్కూడా దిగులేసింది .కానీ శత కోటి కష్టాలకు అనంత కోటి ఉపాయాలంటారు కదా అట్లాగే నేనూ అనుకున్నాను ఏ గడ్డ మీదైతే ఒక టాగూరు ,ఒక శరతూ ,ఒక కుదీరాం బోసు,సత్యజిత్ రే ,ఒక వివేకానందుడూ, పుట్టారో అలాటి చోట నా కూతురూ ఉంది .కనకా ఏదో ఒకటి కాకుండా పోదని .ఆశే కదా జీవితం .....కను చూపు మేరా ఆశ లేని చోటే గొప్ప వాళ్ళు ఉద్భవిస్తారు మరి ..

కామెంట్‌లు లేవు: