బెగాలీలు దశరాని దుర్గా పూజ అంటారు .కారణమేంటో నేను చెప్పలేను కాని వీరు స్త్రీ దేవతలని ఎక్కువగా ఆరాధిస్తారు .కాళీ పూజ, సరస్వతి పూజ,లక్ష్మి పూజ ,విశ్వకర్మ పూజ వీరి ప్రథానమైన పండుగలు . వీరిలో విశ్వకర్మ మాత్రం మగవాడు .ఈ అన్ని పండుగలలో ముఖ్యమైంది దుర్గా పూజ అనబడే దశరా.బెంగాలీల జీవితానికి ఈ పండుగకు ఎంత లంకె అంటే దాదాపు పండుగకు రెండు మూడు నెలల ముందు నుంచే అందరూ హడావుడి పడటం మొదలు పెడతారు పూజ ఆరంభం ఐతే ఇక బజార్ అంతా నిండి పోతుంది .కనక పండుగ కొనుగోళ్ళు ఇప్పుడే మొదలు పెట్టాలి అనుకుంటారు .పూజ నెల ఆరంభం ఐనప్పటి నుండి దిగులు పడటం మొదలు పెడతారు .ఎందుకంటే పూజ ఐపోతే ఈ ఆనందం కోసం మళ్ళీ ఒక ఏడాది ఎదురు చూడాలి కదా అని .నిజంగానే అట్లాగే ఎదురు చూస్తారు ఈ దుర్గా పూజా పూర్తైనప్పటినుండి ఈ సారి దుర్గా పూజకు డబ్బులు కూడ పెట్టటం మొదలు పెడతారు .చెప్పుల నుండి కారు వరకు దుర్గా పూజకే కొనడానికి ప్రాధాన్యం ఇస్తారుఇక పండుగ పది రోజుల ముందు నుండే (హైదరాబాద్ లో) మన వినాయక చవితికి వేసినట్టు అట్టహాసంగా పందిళ్ళు వేయడం మొదలు పెడతారు .ఈ పందిళ్ళు రక రకాలుగ పోటా పోటీగా ఉంటాయ్ . వాటిని ప్రారంభించేందుకు పట్టణ ప్రముఖులను పిలుస్తారు .ఆశ్చర్యంగా ఈ ఉత్సవ కమిటీ లలో సర్వ కుల ,సర్వ మతాల వారూ వుంటారు .మేమున్న టౌన్ లోనే రెండొందల పందిళ్ళు దాకా ఉంటాయ్ .ఇక దుర్గా దేవి ప్రతిమలు ఎంత అందంగా ఉంటాయంటే జీవ కళ ఉట్టి పడుతూ ఉంటుంది .బెంగాల్ ప్రజల ముఖ కవళికలు ఆ ప్రతిమలలో అచ్చు గుద్దినట్లు కనిపిస్తూ ఉంటాయ్ .పూజకి వేసిన పందిళ్ళ దగ్గర పెట్టె సీరియల్ లైట్ల సెట్లలో శ్రీ శ్రీ చెప్పిన సమస్త వృత్తుల చిహ్నాలు కూడ అక్కడక్కడా కనిపిస్తాయ్ . పూజ కోసమని ప్రపంచం నలు మూలల ఉన్న బెంగాలీలు స్వంత ఊర్లు చేరు కొంటారు పండగ కి కొత్త బట్టలు వేసుకుని చేపలు ,మాంసం సుష్టుగా తిని ప్రజలు ఊర్లో ఉన్నఅన్ని ప్రతిమలు చుట్టి వస్తారు .
నేను చెప్పిన పండుగ పేద మధ్య తరగతి వారిది .ధనవంతుల పండగ ఆనందం నాకు తెలియదు .అయినా ఏడాదికోసారి కొత్త చెప్పులు ,బట్టలు కొనుక్కునప్పుడు వచ్చే ఆనందం ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది కొనుక్కోగలిగినప్పుడు దొరుకుతుందా .మనుషులు పేదవారిగా ఉండాలని కాదు దీని ఉద్దేశ్యం .ఏదీ ఎక్కువగా ఉండకూడదని మాత్రమే ............
విజయ దశమి శుభాకాంక్షలు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి