కొద్ది కాలం క్రితం మేం శరత్ చంద్ర చటోపాధ్యాయ ఇల్లు చూశాం.హౌరా జిల్లాలో ఉన్న ఇళ్ళు .కలకత్తా లోవేరే ఇళ్ళు ఉంది .ఇప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా ఉందొ .అప్పుడు నది ఒడ్డునే ఉండేదట. ఇప్పుడు నది జరుగుతూ జరుగుతూ అలా దూరం వెళ్లి పోయింది .ఆయన రాత బల్ల హోమియో మందు సీసాలూ అట్లాగే ఉన్నాయ్ .రాత బల్ల మీద "s"అనే అక్షరం చెక్కి ఉంది. ఆ ఇంట్లో ఉన్నపుడే శరత్ శ్రీకాంత్ లో కొంత భాగం ,రాముని బుద్ధిమంతనం .బిందుగారబ్బాయి మొదలైనవి రాశాడట .ఆ ఇంటి వాకిలికి ఎదురుగా జామ చెట్టు ఒకటి ఉంటుంది .ఆ ఇంటి ఎదురుగా ఒక చెరువు ఉంటుంది .ఈ రెండూ రాముని బుద్ధిమంతనంలో ప్రస్తావించ బడ్డాయనిఅక్కడ వారు చెప్పారు
శరత్ రచనలు ఆంద్ర దేశంలో చదవని వాళ్ళు దాదాపు అరుదే కదా .నేనూ అన్నీ చదివాను కానీ మళ్ళీ ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ చదివాను .మానవ భావోద్వేగాలు అంత బాగా చిత్రించడం శరత్ కి ఎలా సాధ్యమయ్యింది .ఇన్నేళ్ళ తరువాత కూడా అవెంత ఆకట్టుకో గలుగుతున్నాయి .కాలాన్ని చక్రంతో ఎవరు పోల్చారో కానీ ఎంత నిజం .మనిషి ఎంత కాలం భూమిపయ్ ఉంటాడో అంత కాలమూ అవే భావోద్వేగాలు . కొంచం ఫై ఫై మెరుగులు మారాతాయంతే. పాపాయి రోజూ కథలు చెప్పించుకుంటూ ఉంటుంది .మొన్నో రోజు అనిపించింది రాముని బుద్ధిమంతనం చెప్దామని .నా కూతురు మరీ చిన్నది .కొంచెం పెద్ద పిల్లల కథలు చెప్పినా అర్థం కావు .కానీ నెమ్మదిగా రాముని బుద్ధిమంతనం మొదలు పెట్టాను .ఆరేళ్ళ పిల్ల కదా బుద్ధిమంతనం అంటే ఏంటమ్మా అంది పేరుతో మొదటి ప్రశ్న ప్రారంభిస్తూ ...అట్లా చెప్పుకుంటూ వెళ్ళా
తల్లి లేని రాముడూ .అతన్ని తల్లి లా పెంచిన వదిన నారాయణి .నారాయణి తల్లికి రాముని మీద ఎటువంటి కారణం లేకనే కలిగిన ద్వేషమూ .రాముని చేపలు కార్తీక్ ,గణేష్ లు .నారాయణి తల్లి దిగంబరి వాటిలో ఒకటి పట్టించి వండించడమూ రాముని అల్లరీ .పెంచుకున్న చేపల ఫై ప్రేమ .వదిన తల్లి ఫై కోపం .వదిన ఫై ఉన్న గాడతర మైన ప్రేమ .పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్ల వాడి భావోద్వేగాలు అలా అల్లి మన ముందు పరిచి వేస్తాడు శరతు.ఆ మాయాజాలం లో ఆరేళ్ళ నా కూతురు ఎంతలా పడి పోయిందంటే ,తాత కు ఫోన్ చేసినపుడూఇంటి కి వచ్చే వాళ్ళ టీచర్కు ఇంకా ఇంట్లో ఉండే అందరికి చెప్పింది .అంతేనా పదమూడేళ్ళు వచ్చే దాక రామునికి వాళ్ళ వదిన తినిపించి నట్టే బువ్వ తిని పించాలని నియమం పెట్టింది .గారాబం చెయ్యాలన్నది .కొంచం చేపలు తెచ్చి కార్తీకు గణేష్ అన్నది
నేనేమనుకున్నానంటే నా కూతురు కూడా శరత్ లాగా అంత మంచి గా రాయగలిగితే ఎంత బాగుణ్ణు అని. కానీ ఖలీల్ జిబ్రాన్ ని ఇంత గా ప్రేమించేస్తూ ఆయన పేరిట బ్లాగ్ మొదలెట్టి పిల్లల గురించి కలలు ఇట్లా కనడం ఏమైనా బాగుంటుందా అని కలనక్కడ డ్రాప్ చేశేసా .కానీ పిల్లల గురించి కలలు కనడమనేది బహుశ తల్లి తండ్రులకు ఒక సహజాతమేమో ఇక్కడ కనిపించేది శరత్ ఇంటి ఫోటో నే
3 కామెంట్‌లు:
నిజమే కదా, పిల్లలంటూ ఉన్నాక వాళ్ళని గురిచి కలలు కనకుండా ఉండలేము.
మీరు ఉండే ప్రదేశాన్ని గురించి చక్కటి ఫొటోలతో సహా మంచి విషయాలు రాస్తున్నారు. ధన్యవాదాలు.
very nice to see ur blog.శరత్ అంటే నాకూ చాలా ఇష్టం. పథేర్ పాంచాలి పోస్ట్ కూడా చదివాను.బాగా రాస్తున్నారు. గసరత్ ఇంటి ఫోటో పెట్టినందుకు ధన్యవాదాలు.
నా ఇంట్లోకి అడుగిడిన కొత్త బంధువులు కొత్త పాళీ గారికి ,తృష్ణ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు .ఇట్లా అప్పుడప్పుడు పలకరించి పోవాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలతో ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి