మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

24, అక్టోబర్ 2010, ఆదివారం

గౌహతి -కామాఖ్య మందిర్




మే ద్వితీయార్థంలో ఇప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ ప్రాంతానికి వచ్చినపుడు మొదటిసారి నాకు కామాఖ్య దేవత గురించి తెలిసింది .ఆషాడ మాసం 11 తేదీన ప్రాంతం ప్రజలు "అమ్బుబాచి " పండుగని జరుపుకుంటారు .అస్సాం లోని కొంత బాగం ఒకప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ రాజ్యానికి సంబందించింది . రాజే కామాఖ్య మందిరాన్నిమొదటిసారి నిర్మించారు .అమ్బుబాచి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక మేళ కూడా జరుగుతుంది .దానిని అమ్బుబాచిమేళ అని పిలుస్తారు .

v>
అమ్బుబాచి పర్వదినం కామాఖ్య అమ్మవారి రుతు క్రమానికి సంబంధించింది .సంవత్సరానికోసారి కామాఖ్య దేవత రుతుమతి అవుతుందట . సమయంలో ప్రాంత ప్రజలంతా పూజ గదులు మూడు రోజులు మూత పెడతారు .శాఖాహారమే తీసుకుంటారు .సంద్యాదివందనలేవీ చేయరు .


మేముంటున్న ప్రాంతం నుండి గౌహతి 7 గంటల దూరం .పొద్దుటే 7 గంటలికి ఇక్కడి నుండి బయలుదేరాము .సర్క్యుట్ హౌస్ లో బస .బ్రహ్మ పుత్రా నది ఒడ్డున ఉంటుందీ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ .గది ముందు కూర్చుంటే కను చూపు మేర నెమ్మదిగా ప్రవహిస్తూ నది ప్రశాంతతనిస్తుంది.పొద్దుటే లేచి దర్సనానికి వెళ్ళాం .కామాఖ్య దేవీ భాగవతం ,కాలిక పురాణంలో చెప్పబడ్డ శక్తి పీటాలాలో ఒక పీటం .దాక్షాయణిదేవి మిగిలిన శరీర భాగాలు ముఖ భాగం కలకత్తా దక్కిన్ కాళీ మందిరం ,స్థాన భాగం ఒరిస్సా భరంపురంలో,పాద భాగం పూరీలో పడ్డాయట .బ్రహ్మపుత్ర నదికి అవతల శివ మందిరం ఉంది .కామాఖ్య మందిరం గర్భ గుడిలో యోనిని పోలిన పీటం ఒకటి ఉంటుంది .అక్కడ ఒక సహజ జల ఊరుతూ ఉంటుంది . జల ఏడాదిలో మూడు రోజులు రక్త వర్ణంలో కనిపిస్తూ ఉంటుందట .దీనినే వీరు దేవత రుతు మతి కావడం గా భావిస్తారు .కామాఖ్య మందిరం నుండి పాతిక కిలో మీటర్ల దూరంలో సువాల్ కుచి అనే ప్రాంతం ఉంటుంది ఇక్కడ ప్రపంచ ఖ్యాతి గాంచిన ముగా పట్టు చీరలు నేస్తారు .అస్సాం మహిళలు మన లంగా ఓణీ ని పోలిన చీరను కట్టుకుంటారు .దీనిని మేఖల అని పిలుస్తారు అయినా మామూలు చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయ్ .
రెండవ రోజు రాత్రి ఇంటికి ప్రయాణం అయ్యాం.దాదాపు 370 కిలో మీటర్ల దూరంలో 27o కిలో మీటర్లు అక్కడక్కడ లారీలు తప్ప ఇంకే వాహనాలూ కనిపించ లేదు .అస్సాం తీవ్రవాదుల భయం చేత రాత్రులు ఎవరూ ప్రయాణం చేయరని డ్రైవర్ చెప్పాడు మొత్తానికి కామాఖ్య మందిర దర్శనాన్ని అల్లా ముగించుకుని ఇంటికి చేరాం.అస్సాం గురించి "విషాద కామరూప"అని ఇందిరా గోస్వామి ఒక నవల రాసారు .నవల లోతుగా లేకపోయినప్పటికీ అప్పటి అస్సాం ని కొద్దో గొప్పో మన కళ్ళ ముందుకు తెస్తుంది .అందులోనూ మీకీ కామాఖ్య మందిర ప్రస్తావన కనిపిస్తుంది నవల కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా పొందింది .



కామెంట్‌లు లేవు: