మేము ఇవాళ పల్లవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం .బెంగాల్ కాటన్ చీరలకు ప్రసిద్ధి .మనం బెంగాలి కాటన్ అని పిలిచే చీరల్నే వీళ్ళు తాతేర్ సాదీ అని పిలుస్తారు ..ఒకప్పుడు ఇవి కుటీర పరిశ్రమలుగా కళకళ లాడుతూ ఉండేవి .ఇప్పుడు పవర్ లూం రాక హ్యాండ్ లూం ని బాగా దెబ్బ తీసింది .ఇప్పుడు భారత దేశం లోని అన్ని ప్రాంతాల లాగానే బెంగాల్ లో కూడా చేనేత దెబ్బ తిన్నది .కుటీర పరిశ్రమగా ఎవరూ చీరలు నేయడం లేదు .
బెంగాల్ లోనూ అస్సాం లోనూ మనం వాడే టవల్ కి బదులుగా " గంచా "అనే నూలు బట్టను టవల్ గా వ్యవహరిస్తారు .చాలా పలుచగా ఉండి సులువుగా తడిని పీల్చుకుని ఉతికేందుకు సులువుగా ఉండి త్వరగా ఆరి పోతాయి . ఇప్పుడు బెంగాల్ లో చేనేత కేవలం గంచా అనే ఈ వస్త్ర విశేషం మీద ఆధార పడి నడుస్తుంది .పల్లబ్ వాళ్ళ ఇంట్లో దాదాపు పదిహేను మగ్గాలు ఉన్నాయ్ .ఈ మగ్గాల ఫై వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ పని చేయరు .వాళ్ళు యజమానులు .చేనేత కారులు నేస్తారు .నాలుగు గంచాలు కలిపి ఒక తానుగా వ్యవహరిస్తారు .అలాటి తానులు ఒక వ్యక్తి రోజుకు ఆరేడు నేయగలదు .ఒక తానుకు పద్దెనిమిది రూపాయలు కూలి .హోల్ సెల్ లో నాలుగు గంచాల విలువ ఒంద .బయట ఒక్కో గంచా విలువ యాబై రూపాయలు.అట్లా పల్లబ్ వాళ్ళ ఇళ్ళంతా ఈ గంచాలతో నిండి పోయి ఉంటుంది .మేము కొన్ని గంచాలు తీసుకున్నాం .వాళ్ళ ఇంట్లో పెంపుడు పావురాలు గూళ్ళు చాలా ముచ్చటగా కనిపించే .ఇంకా పాపాయి అక్కడ రాట్నం కూడా చూసింది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి