ఇక్కడ బానేస్వర్ అనే శివుడి గుడి ఉంది .చాల పురాతనమైన గుడి .రాజుల కాలంలో నిర్మించిన గుడి .కార్తీక మాసం ఇక్కడ కూడా బాగానే జరుపుకుంటారు .రాత్రి ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగించుకుంటారు .నదీ స్నానాలు ,ఉపవాసాలు సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు . అట్లా ఈ బానేస్వర్ మందిరానికి వెళ్ళాం .బావి లోపల ఉన్నట్లు శివ లింగం ఉంటుంది .ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఆలయం పక్కనే ఉన్నచిన్న చెరువు .ఇక్కడ వీళ్ళు చెరువుని పుకూర్ అంటారు .అందులో అతి పురాతనమైన తాబేళ్లు ఉన్నాయ్ .అవి రాజుల కాలం నుంచి ఉన్నాయని వీళ్ళు అంటారు .
తాబెళ్ళని వీరు కచ్ఛపి అని మోహన్ అని పిలుస్తారు .భక్తులు వేసే బొరుగుల కోసం అవి మెడలు చాచి ఒక దానితో ఒకటిపోట్లడుకుంటాయి.కూటి కోసం పోట్లాటలు మానవజీవితంలోనే కాదు అన్ని జీవాజాలాలకితప్పదేమో
.
అక్కడ పాపాయికి ఒక బుజ్జి మేకతో పరిచయం కలిగింది .దేవుని ప్రసాదంగా ఇచ్చిన చక్కర గుళ్ళు పాపాయి మేకకు పెట్టింది .మేక అట్లా పాపాయితో నేస్తం కట్టింది .అలా ఒక్కో గుండు వేస్తూ పాపాయి మేకని మా దగ్గరికి పట్టుకోచ్చేసింది .
చాల సేపు మేకతో ఆడి చివరిగా మేకని మనతో తీసికెలదాంఅని బ్రతిమాలింది .కానీ ఎలా అవి దేవుని మేకలు అని చెప్పాను పాపాయి బలి అంటే ఏంటి ఎందుకు అని అనేక ప్రశ్నలు అడిగింది .మొన్నీ మధ్య ఇక్కడ మదన మొహనుడి ఆలయానికి వెళ్ళాం .అక్కడ కొన్ని మేక పోతులూ మేస్తూ కనిపించాయి .అవే దుర్గా పూజ రోజు బలి ఇవ్వ బోయేది అని వీళ్ళు చూపించారు .రెండు రోజుల తరువాత మందిరం నుండి ప్రసాదం రూపేణా ఆ మాంసం మాకు పంపారు .ఆ మేకలు చూసినప్పుడే చాల భాధ కలిగింది .అక్కడ పాపాయికి ఒక బుజ్జి మేకతో పరిచయం కలిగింది .దేవుని ప్రసాదంగా ఇచ్చిన చక్కర గుళ్ళు పాపాయి మేకకు పెట్టింది .మేక అట్లా పాపాయితో నేస్తం కట్టింది .అలా ఒక్కో గుండు వేస్తూ పాపాయి మేకని మా దగ్గరికి పట్టుకోచ్చేసింది .
కామాఖ్య మందిరంలో కూడా ఎవరో మేకని తీసుకు వెళుతున్నారు అది గడ్డి నములుతూ హాయిగా వెలుతుందిఅప్పుడూ అనిపించింది. దేవుడు జీవాలని బలి ఇవ్వమని అదుగుతాద యెక్కదైనా అని .ఇవాళ ఇంట్లో చేపలు తెచ్చారు. నేను ఐచ్చికశాకహారిని .చిన్నప్పటి నుండి .ఇవాళ ఎందుకో చేపలు తోమడం చూసాను .బతికి ఉన్నచేపని తల నేలకి కొట్టి చంపుతారు .బాధ సంగతి వదిలి పెడితే సమాధానం మటుకు దొరికింది .ఇంత మంది మాంసాహారం కోసం ఇన్ని జీవాలని చంపుతుంటే దేవుడికి ఏడాదికోసారి ఇచ్చే బలి తప్పెందుకవుతుంది .కనుక బలులను ప్రభుత్వం నిషేదించడమే తప్పు .బలులను నిషేదించడం కరక్టైతే మనం ప్రతి రోజూ చేసే బలులు కూడా నిషేదించాల్సిందే కదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి