మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

26, అక్టోబర్ 2010, మంగళవారం

పాము -కప్ప

ఇవాళ పదకొండున్నరకి అట్లాగా మా అమ్మ పాముని చూద్దువు గాని రమ్మని కేకేసింది .పది రోజుల క్రితం మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చేరు .మేమిప్పుడు కాస్త పట్నం వాల్లమయ్యాం గానీ మా అమ్మకి పల్లెటూరి వాసన ఇంకా పోలేదు అంచేత పాము పట్టుకున్నపుడు కప్ప పెట్టె గావు కేకల్ని విని ఇక్కడెక్కడోపాము ఉందని కని పెట్టేసింది .నాతో పాటు నా కుక్క పరిగెత్తుకొచ్చింది .కుక్క భయానికి పాము కప్పని వదిలేసింది .అంత వరకు చోద్యం చూస్తున్న బెంగాల్ కుర్రాడు ఇవాళ కప్ప "కపాల్ బాలో"అని సంతోష పడ్డాడు .అంటే కప్ప అదృష్టం బాగుందని అర్థం .అంతకు ముందో రోజు ఒక పాము మా ఇంట్లోకి వచ్చేసింది . మనిషి చక్కగా ఆ పాముని బయట వరకు నెట్టుకుంటూ వెళ్లి పోయిరంమని సాగనంపేడు .అప్పుడు ఇంకా నాకు పాముల పట్ల బెంగాలీ ప్రజల వ్యవహార స్సైలి తో పెద్దగ పరిచయం లేక పోవడం చేత పాపాయి చిన్నది కదా మేమైతే సరే అనే భయం చేత ఘోరంగా గొడవ చేసి ఆ పాముని చంపించేసాను .


పాముని కొట్టేటప్పుడు కూడా ఆ పాపమంతా నాకే చెందు గాక అని మనుసులో ప్రార్థించుకుని తరువాత పాముఫై దెబ్బ వేసాడు ఆ మనిషి .బెంగాలీలు "మాన్సాయ్" దేవతను పూజిస్తారు .మాన్సాయ్ దేవత మన నాగ దేవత ఒకటే .వారికి ఆ దేవత పట్ల భయ భక్తులు మెండు .అంచేత పాముల్ని సాధ్యమైనంత వరకు చంపరు ఏ పాము కనిపించినా మనమెక్కడ చంపమంటామోనని అబ్బే దానికసలు విషమే లేదనేస్తారు .ఇంట్లోకోచ్చిన పాము సంఘటన తరువాత నేను నింపాదిగా ఆలోచించుకొని బెంగాలీల భావజాలాన్ని గౌరవించాలని నిర్ణయించుకొని ఇప్పుడు పాము కని పిస్తే చూసీ చూడనట్లు వచ్చేయడం నేర్చుకున్న .ఇవాళ పామును గురించి అడిగితే కూడా అలాగే చెప్పారు అదేమీ చేయదు చాలా మంది దానిని జేబులో పెట్టుకు తిరుగుతారు అనీ ఇంకా తుంపర తుమ్పరగా వాన పడేప్పుడు ఈ పాములు ఆకాశం పినించి రాలుతాయని .ఎప్పుడు కరిసినా ఏమీ కాదు కానీ ఆదివారం కరుస్తే మటుకు తిరుగే లేదని చెప్పారు .href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgujl3bJxmHeBAN1Un6lJIliVo767NzPMn7kckfHb5ZCP00OzMl-ZW1pHLRe33wVDqpr0clI5__BHfbXKGkaozeBoudZ1zoryNnlIF4rPrRbXhoANjl7dyyVZwf-byiTJZ8EVRS_G0YkKc/s1600/snake+028.JPG">విషం లేని పాముకి ఆది వారం విషం ఎక్కడనుంచి వస్తుంది .పాముల మాట అటుంచితే మా ఇంట్లో జలగలు కూడా ఉన్నాయ్ .మా కుక్కల్లో కాంచన అనే కుక్కకి ఆరు బయట ఆడటం బాగా ఇష్టం అలా ఆడుకునేప్పుడు జలగలు దాన్ని పట్టుకు ని దాంతో పాటు ఇంట్లోకి వచ్చేస్తాయి .ఇంట్లోకి రాగానే మనిషి వాసన తగుల్తుందేమో కుక్కని వదిలేసి మన వైపు ప్రయాణం మొదలు పెడతాయి .చూసుకుంటే అదృష్టం లేకుంటే వాటికారోజు ఫెస్టివల్ .మా ఇంటికొచ్చే వాళ్ళంతా హడలి పోతుంటారు .పాములు అదో రకం మనల్ని చూసి తప్పుకుంటాయి జలగలు అలా కాదు కదా మనల్నే టార్గెట్ చేసుకుంటాయి మనల్ని దొరకబట్టుకుని కాస్త లోకల్ అనస్తీశియ ఇచ్చి మన రక్తం పీలుస్త్హాయి .అదీ ఇవాళ పాము కప్ప విషయం ఆ పాము అట్లా నా బ్లాగ్ లో ఫోటో ఐంది .నా పోస్టుకో విషయమైంది ....


కామెంట్‌లు లేవు: