మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

2, డిసెంబర్ 2010, గురువారం

ఇస్మాయిల్


25 తేదీన ఇస్మాయిల్ కోసం బ్లాగ్లో రాయాలనుకున్నాను .ఇస్మాయిల్ కవిత్వమంటే నాకు విపరీతమైన ఆకర్షణ .గొప్ప వ్యక్తుల్ని కవుల్ని కలిసి చూడటం నాకెప్పుడూ ఆసక్తిగా అనిపించదు ,కానీ చలాన్ని ,ఇస్మాయిల్ ని కలవగలిగి ఉంటె బాగుండనిపిస్తుంది.ఇక తీరని కోరిక .ఇస్మాయిల్ కవితలలో నాకు బాగా ఇష్టమయింది ఒకటి ఇక్కడ ........

వేయి పిర్రల సముద్రం


ఊగుతోంది వేయి పిర్రల సముద్రం

ప్రియా ,నిర్ణిద్రం

లాగుతుంది స్మృతి నౌకను ఉప్పాడకు

ప్రియా, నీ జాడకు



మొగ్గి చూస్తోంది రెప్ప లేని కన్ను

ప్రియా, మిన్ను

సిగ్గు లేని సాగరం వర్తించు నగ్నంగా

ప్రియా, ఉద్విగ్నంగా



పాదుకున్నాయి మనలో కడలిఊడలు

ప్రియా ,మన నాడులు

ఈదు నిశ్శబ్దపు చేపలు రొదనిచీలుస్తో

ప్రియా,నను పిలుస్తో




నురగలుకక్కే సాగరతీరాన

ప్రియా, రతీవరాన

విరగనితరగలం మనం మాత్రం

ప్రియా, విచిత్రం



ఎండ్రకాయల్ని తోలే ఏటవాలు సూర్యుడు

ప్రియా ,అనార్యుడు

పండు వంటి నీమేను స్పృసిస్తాడు

ప్రియా ,కందిస్తాడు




అల్లుతుంది అలలపై చంద్రుని సాలీడు

ప్రియా ,తన గూడు

అందుకో ఆహ్వానం ప్రవేశించు జాలంలో

ప్రియా ,ఇంద్రజాలంలో



చుట్టుకు పోయిన నరాలతో

ప్రియా ,కరాలతో

పెట్టుతోంది సంద్రం నిరంతరం రొద

ప్రియా ,విను దాని సొద




చుట్టుకుపోయే శంఖాన్నడుగు

ప్రియా ,ఎదనడుగు

చూరు కింద చుట్టుకొనే హోరు గాలి చెప్పదా

ప్రియా ,మనకథ విప్పదా



వేగలేను కడలిమ్రోల అహరహం

ప్రియా ,నీ విరహం

ఊగుతోంది వేయి పిర్రల సముద్రం

ప్రియా ,నిర్ణిద్రం.





కామెంట్‌లు లేవు: