బైసాఖి మేలా కి వెళ్లి వస్తున్నాం నేను మా అమ్మాయి .మా అమ్మాయి బోలెడంత సేపు జైంట్ వీళ్ళు ...అవీ ఇవీ తిరిగింది.ఇంటికి వస్తున్న దారిలో కబుర్లు మొదలెట్టింది
పాపాయి: అమ్మా గార్డ్ రూం నాకు ఇచ్చేయ్యమ్మా నాకు ల్యాబ్ గా బాగా పనికి వస్తుంది.
అమ్మ:గార్డ్ రూం కాదు రా కింద బెడ్ రూం తీసుకో కావాలంటే
పాపాయి:సరే అయితే పైన బెడ్ రూం లో వుండే బల్లని ఆ రూం లో వేసుకుంటా ...
అమ్మ:సరే అట్లాగే
పాపాయి:అమ్మా నాకు నోబెల్ ప్రైజ్ వస్తే ,ప్రైజ్ మనీ వస్తుంది కదా దాన్నేం చేసేదమ్మా ?
అమ్మ:పేద స్టూడెంట్స్ కి చదువుకునేందుకు పంచిపెట్టు
పాపాయి :ఆహా !కాదమ్మా దాంతో నేను పెద్ద రంగుల రాట్నం కొనుక్కుంటా !!!
అమ్మ: :))...:))...:))
6 కామెంట్లు:
కలలు కనాలి. అవి నిజం కావాలి.
బాల్యం నుండే మంచి దిశా నిర్దేశం లో సాగుతున్న పాపాయి .. ఆ ప్రైజ్ విలువ తెలుసుకుని.. కృషి చేయాలని చెపుతూ ప్రోత్స హించడం .. చేస్తే.. కలలు నిజం అవుతాయి.
పాపాయి కొనుకున్న జైంట్ వీల్ నేను ఎక్కలేనేమో .. సుదీర గారు.:))
hahaha!
Cute!
@Indian Minerva ,రసజ్ఞ ,జలతారువెన్నెల *కృతజ్ఞతలు*
@వనజవనమాలి : వనజ గారు నేనూ నాతో పాటు ఇట్లా మీరు మా అమ్మాయి రంగుల రాట్నం లోనే వున్నాం . థాంక్ యు .
Super. నేను రైలింజను కొనుక్కోవాలని కలలు కనేవాణ్ణి!
నారాయణ స్వామి గారు
థాంక్ యు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి