నిన్న మా మాల్దా లో డాగ్ షో జరిగింది . పాపాయి ఇక పొద్దుటి నుండీ ఉత్సాహ పడటం మొదలెట్టింది . పాపాయి వాళ్ళ నాన ''కాదురా మీనాక్షూ మన వాటికసలు డిసిప్లెన్ లేదు కదా అక్కడేమో అన్నీ ట్రైన్డ్ డాగ్స్ వస్తాయి కదా .వద్దులె రా...'' అని అన్నాడు . అయినా పాపాయి ఆహా తీసుకేల్లాల్సిందే అన్నది .
వాటి కోసమని ఏదో బట్ట ముక్క తీసుకుని బటన్ పెట్టి వాటికి బౌ కుట్టింది .స్నానమ్ చేయించింది . మాకేమో చాలా రోజుల నుండీ సినిమా టికెట్స్ బుక్కవుతూ కేన్సిల్ అవుతూ నిన్నటికి కుదిరింది .తప్పకుండా చూడాల్సిన అపర్ణా సేన్ ''గోయినార్ బాక్షో '' సినిమా . దేయ్యముంది ఆ సినిమా లోరారా [పాపాఇకి దెయ్యాల సినిమాలంటే ఇష్టం] అన్నా పాపాయి నేను రాలేను అనేసింది . సుక దేవ్ ని ,రాజీవ్ ని తీసుకుని డాగ్ షో కి వెల్లి పోయింది .
నాన డాగ్ షో ని లాంచనం గా ప్రారంభించి ఇంటికొచ్చాక మేమిద్దరం ''గోయినార్ బాక్షో '' సినిమాకి వెళ్లి పోయాం . మధ్యలో పాపాయి ఫోన్ చేసింది కాంచనా కి ప్రైస్ వచ్చిందని . ఆ తరువాత మేం వచ్చాం . అప్పటికి రాజమ్మ కి కూడా ప్రైస్ వచ్చిన్ది. ఎట్లాగబ్బా అంటే కాంచన గోల్డెన్ రిట్రీవర్ కదా ... దాని జాతిలోని ఒక పదమూడేళ్ళ ముసలి కుక్కని ఓడ కొట్టేసి రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నది . రాజ మల్లిక కూడా రన్నింగ్ లో ఫస్ట్ వచ్చింది అదేట్లాగరా అంటే పాపాయి చెప్పిందీ . దాని జాతిలో అదొక్కటే ఫిమేల్ అట అందుకని .ప్రైజ్ ఇచ్చారట .ఇంకా ఏందంటే రాజమ్మ రన్నింగ్ రేస్ మధ్యలో చటుక్కుని పడుకుని నేను లేవనంటే లేవనన్నదట . [దానికిష్టం లేని పనులు చెప్తే అడద ట్లాగే పడుకుని ఇక ఎందరు లేపినా లేవదు] పాపాయి ఏం చేసినా లేవ లేదట . అయితేనేం బహుమతి తెచ్చుకున్నది .
అక్కడికి వచ్చిన వాళ్ళలో పాపాయి యంగేస్ట్ పార్తిసిపెంట్ అట .వేరే కుక్కలికి పెద్ద పెద్ద కప్పులు స్వయానా వాళ్ళ నాన ఇస్తుంటే పాపాయి ,స్పోర్టివ్ నెస్ వున్న బ్రాడ్ మైండెడ్డ్ బిడ్డ కనుక కొంచెమన్నా ఫీలవకుండా ,ఈ సారి వీటికి పుట్టే బిడ్డల్ని బాగా ట్రైన్ చెయ్యాలి అనుకుంది .ఆ బహుమతులకే ఉబ్బి తబ్బిబ్బయింది .
పీ.యెస్ :ఆ రోజు సాయంత్రం పాపాయి వాళ్ళ నాన దగ్గరికి బోలెడు సర్టిఫికెట్స్ వచ్చాయి సంతకాల కోసం డాగ్ షో వి .నాకు చిరాకొచ్చింది .పొద్దుటి నుండి అవసరమైన ఫైల్లే బోలెడన్ని వుంటాయి . తలెత్తకుండా చదివి సంతకాలు చేసినా ఆదివారానికి మూడు మూటలు సిద్దంగా వుంటాయి. అవి చాలక ఈ డాగ్ షో ల సంతకాలు కూడానా అని నేను విసుక్కున్నాను. పొడుగు సంతకం ఎందుకులే ఏదో ఒకటి పెడుదూ అని పొట్టి సంతకం పెట్టించాను పాపాయి వాళ్ళ నాన చేత . రాత్రి సినిమా నుండి తిరిగొచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యుషన్ కి కలుసుకున్నామా అప్పుడు అక్కడి వాళ్ళ ఆనందం చూస్తే అవును కదా ఇలాటి వుద్యోగం ఒప్పుకున్నాక ఇక పొట్టి సంతకం అంటే కుదురుతుందా అనిపించింది. డిగ్రీ సెకండ్ యియర్లో నాకో స్టేట్ లెవల్ ఎస్సే రైటింగ్ బహుమతి లభించింది . మెడల్,సర్టిఫికేట్ ,హైదరాబాద్ l b స్టేడియం లో బహుమతి ప్రధానం . చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ,ఆయన సంతకం తో బహుమతి పొందటం గొప్ప కదా . ఇది కూడా అంతే కదా అని సన్నివేశాన్ని అన్వయించుకున్నాను. అన్నట్టు నేను హైదరాబాద్ కి మొదట రావటం అదే .

2 కామెంట్‌లు:
పాపాయి పట్టుదలకి ముచ్చటేస్తుంది అభినందనలు .
విజేతలకి జేజేలు.
సామాన్య గారు మీ జ్ఞాపకం బావుంది . పిక్ షేర్ చేస్తే బావుండేది
Thank you Vanaja gaaru.thappakundaa...
కామెంట్‌ను పోస్ట్ చేయండి