నిర్విచారపు నిర్మల మధ్యాహ్నం
పంజరంలో బాల్యపు మైనా
కొన్ని జ్ఞాపకాలు వత్తిగిలి పడుకున్నవి
ప్చ్ ! వద్దన్నా వదలకున్నవి
అలమార లోపల ,ఆ లోపల ఇంకో రహస్యపు అర
అరలో అలా ? అల ల ల లాలా?
అందులో వెదురు పెట్టె ఒకటి
చిగురులతో పచ్చటిది
అవునూ
అందులో ఏముందో ఎవరికైనా ఎందుకు పంచాలి ?
ఆ నది పక్కన పిల్లల్లా రాళ్ళు కొట్టాలి
కలలా చిరునవ్వులా
వేలు చితికితేనో
ప్చ్ అసలట్లా కాదు !
తనన్నదీ పోమ్మన్నారూ అని
తనకైనా ఎవరికైనా
చిన్నప్పుడు ,గెలిచేందుకే ఎగుర వేసిన
పల్లంచి రాళ్ళలా
నాలుగు రాళ్ళు కావాలి
అప్పుడిక
అప్పుడిక
పో!పో! నువ్వే పో !
పది సార్లు పో!
ఒంద సార్లు పో !
నువ్వే పో !
లెక్క వేస్తే గుప్పెడైనా లేవు రోజులు
పాపం అంతలోనే ద్వేషిస్తారు
అయ్యో ఆమె అసూయా దేవి
పోన్లే ,పోన్లే ,పోన్లేమ్మని
దయాకరులమై హసించి ,ఉదయించి,దయుంచి
కానీ
ఎన్ని సార్లున్చుతాం
ఒక వీరుడు మరణించిన
వేల వీరులుదయింతురు
వీరుడులు , డులు..లు
అని కదా !!!కదా ఆ ..ఆ.. ??
నిర్మల మద్యాహ్నం
బాగుంది సంపెంగ పూలలా
జల జల రాలిపోయినా ...
చెదరని సువాసనలా
1 కామెంట్:
nice...
కామెంట్‌ను పోస్ట్ చేయండి