మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

11, మే 2012, శుక్రవారం

హృదయం ఉప్పొంగిన క్షణాలు ...


 నిన్న మా ఇంట్లో కీర్తోన్ జరిగింది .మా నిభా పోరు భరించలేక  ఒక వైపు ,సరే బెంగాలుల కీర్తనలు యెట్లా ఉంటాయని ఆసక్తితో ఒక వైపు సరే అన్నాను.
తబలా ,హార్మోనియం పట్టుకుని ట్రూప్ దిగి పోయింది.నిభా హడావిడి చిన్నది కాదు .డబ్బు పుచ్చుకుని వెళ్లి ఏవేవో కొన్నది .అవీ ఇవీ వండింది.షీలా,అనిత ,భోగీందర్ కీర్తోన్ కోసం రాత్రి ఉండి  పోయారు.నేను ,పాపాయి వాళ్ళ నాన్న మధ్యలో జండా ఎత్తేసాం .పాపాయే అన్నీ తానై చూస్తుండింది .
సగంలో ఒక సారి వచ్చి అమ్మా షీలా..అనిత వాళ్లకి వండినవి పెట్టదంటమ్మా నిభ ,ఇంత రాత్రి ఇంటికి పొయ్యి ఏం తింటారమ్మా ?నేను పెడతా !వాళ్ళు తిన్నాకే కీర్తన్ వాళ్ళు !అన్నది .పనిలో వున్న నాకు రాజకీయం అర్థం కాలేదు .నీ ఇష్టం వచ్చినట్టు  చెయ్ బిడ్డ అన్నాను .
పొద్దుటే అనిత ,షీలా ,భోగీందర్ కలిసి కట్టుగా వచ్చి పాపాయిని కీర్తించడం మొదలెట్టారు .వాళ్ళని పక్క రూం లోకి తీసికెళ్ళి కూర్చో పెట్టి కడుపు నిండా తిన పెట్టిందట .లేకుంటే నిభా వల్ల  వాళ్లకి ఆ రాత్రి ఇంట్లో తిండి లేక పొయ్యేదట .మీ అమ్మాయి పెద్ద పెరిగితే ఎంత మంచి అమ్మాయి అవుతుందో ...అంత చిన్న బిడ్డకి అంత మంచి బుద్ది అని కీర్తించారు 
వాళ్ళ మాటలు వింటుంటే ఎంత సంతోషం వేసిందో .గర్వం కలిగింది .ఇంత చిన్నప్పుడే మనిషి పై దానికున్న అక్కర మంచి  కలలు కనమని  ధైర్యాన్ని ఇచ్చింది .వాళ్ళ మాటలు వింటున్నప్పుడు అప్పటికప్పుడే స్కూల్ కి వెళ్లి వున్న మా అమ్మాయిని పిలిపించి  హత్తుకోవాలనిపించింది.ఆనందపు  దుక్ఖం గొంతులో కోటుకలాడింది .
ఈ రోజు ఇది రాసుకుంటూ అమ్మ ఇష్టంగా చెప్తుంది .డైరీ లో రాసి పెట్టినట్టు రికార్డ్ చేస్తుంది. ఏమంటే ఆందుకని లవ్ యు రా పాపాయి .

6 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పాపాయి కి మీరు మాత్రమే కాదు.. ఐ లవ్ యు! అని చెప్పే దానిలో
నన్ను కూడా చేర్చుకోండి .. ఐ లవ్ యు సో మచ్..పాపాయి!!.
ఇతరుల ఆకలి ని గుర్తించడంలో ,ఇతరులకి కలిగే ఇబ్బంది గమనించి ..ఆదరించి ఆకలి తీర్చే పాపాయిలో..బుల్లి అమ్మ కనబడింది.

గోదారి సుధీర చెప్పారు...

Thank you ...thank you very much Vanaja garu

స్నేహ చెప్పారు...

మీ పాపాయి నాక్కూడా భలే నచ్చేసింది. రెండు రోజులుగా మీ బ్లాగ్ మొత్తం చదివాను. చదవగానే ఎవరో ఆత్మీయ స్నేహితురాలి కబుర్లు వింటున్నట్టనిపించిందండి.

జలతారు వెన్నెల చెప్పారు...

మంచి పాపాయి! మీ పాపాయికి మా ఆశీస్సులు!

గోదారి సుధీర చెప్పారు...

స్నేహ గారూ
మీ పేరు చూడగానే నా స్నేహితురాలు స్నేహా ఏమో అనుకున్నాను .బ్లాగ్ మొత్తం చదివినందుకు ఆత్మీయురాలిగా ఫీలయినందుకు కృతజ్ఞతలు .
స్నేహంగా
సామాన్య .

గోదారి సుధీర చెప్పారు...

జలతారు వెన్నెల గారు
హృదయపూర్వక కృతజ్ఞతలు .
మీ ఆసేస్సులు పాపాయికి అందజేసాను .
థాంక్ యు అని చెప్ప్పమంది.