పాపాయికి పరిక్షలు నడుస్తున్నాయ్ కదా .అందుకని అది పొద్దుటే ఐదుకంతా లేసేస్తుంది .స్వంతంగా, ఎవరూ లేపాల్సిన పని లేకుండా .ఇంత చిన్నప్పుడే బయోలాజికల్ క్లాక్ సెట్ కావడం ఆశ్చర్యమే .నానని లేపుతుంది నానా లే నానా అని లేవకుంటే ఏడుపు మొదలు పెడుతుంది .రాత్రి పడుకునేప్పుడు కూడా ఐదుకంతా లేపాలని ఒట్టు పెట్టించుకుంటుంది .ఇవాళ అట్లాగే లేచింది .మా అమ్మ అంటుంది ఎంత అదృష్టం ఇంత మంచి కూతరు పుట్టింది నాకూ పుట్టింది దండగమారి కూతురు అని .నేను మా అమ్మ ఎనిమిది వరకు చదవాలంటే గడియారంలో ఏడు గంటల్ని ఎనిమిదికి తిప్పి ఎనిమిదని చూపించి పడుకునే దాన్ని .పది రోజుల క్రితం మా అమ్మ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి .అంచేత పాపాయిని బడికి సిద్దం చేసేందుకు నేను లేవాల్సిన పని లేదు .మా నాన్న దాని చదువు చూస్తాడు ,మా అమ్మ స్నానం చేపిస్తుంది ,మా పెదమ్మ జడలేస్తుంది ,జడలేసేప్పుడు మా అమ్మ తినిపిస్తుంది .చుట్టూ మనుషులే .ఆలాజాలంగా .ఆది వారం వాళ్ళు వెళి పోతారు .అప్పుడు మళ్ళీ మేం ముగ్గరమే.నేను మా ఊరి నుండి ఒందల కిలోమీటర్ల దూరపు వరుడ్ని ఎంచుకున్నా.అదృష్టం అతనికి మరో కొన్ని ఒందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగమిచ్చింది.ఏం చేస్తాం కడుపు కూటి కోసం పని చేయక తప్పదు కదా ..అన్నీ ఉంటాయ్ గంటల తరబడి మాట్లాడటానికి ఫోన్లు ,చూసుకోవడానికి వెబ్ కామ్లు కానీ ఏదో లోటు ముక్యంగా పాపాయికి .ఎన్ని అభిప్రాయ భేదాలున్న మనుషుల్ని ఏవీ పూరించాలేవు కదా .
ఇవాళ పాపాయికి మా అమ్మ స్నానం పోస్తుంది పాపాయి ఏవేవో కబుర్లు చెప్తుంది .ఈ మధ్య అది శరత్ హేమంగిని కథ విన్నది విన్నప్పుడు అడిగింది హేమంగిని అంటే ఏంటని. చెప్పాను బంగారం వంటి శరీర భాగాలు కలదని .మా అమ్మని ఆ ప్రశ్న వేసి టెస్ట్ పెట్టింది మా అమ్మ ఫెయిల్ అయ్యింది మా నాన్న పాసయ్యాడు .మళ్ళీ కాదంబిని అంటే ఏంటని అడిగింది .మా నాన్న చెప్ప లేక పోయాడు .ఆ ప్రశ్న నా దగ్గరకే వస్తుంది ఎలాగూ. అంచేత నిదర మంచం మీదే నిఘంటువు పట్టుకు చూసా కాదంబినీ అంటే స్త్రీ ,మేఘాల వరుస అని అర్థాలు ఉన్నాయ్ .చెప్పే సరికి పాపాయి సంతృప్తి పడింది .శరత్ కథలలో ఒకటి హేమంగిని. దయ ప్రేమ మెండుగా ఉన్న స్త్రీ పాత్ర హేమాంగిని కాగా ,కటినమైన హృదయం కలిగిన స్త్రీ కాదంబిని .వీరిద్దరూ తోటి కోడళ్ళు . కాదంబిని మారుటి తమ్ముడు కృష్ణుడు. తల్లి చని పోయి ఆశ్రయం కోసం మారుటి అక్క దగ్గరకి కృష్ణుడు రావటం .అక్కడ వాడి దుస్థితి .తనకేమీ సంభంధం లేకున్నా హేమాంగిని వాడి విషయంలో స్వంత భందువల్తో పోట్లాడటం చివరికి వాడ్ని తనే పెంచుకునేందుకు భర్త ఒప్పుకోక పోవడంతో భర్తని వదిలెయడానికి సిద్ద పడటం, చివరికి భర్త ఒప్పుకోవడం .కథంతా ఉద్వేగ భరితంగా సాగి పోతుంది .హేమాంగిని హృదయ ఔన్నత్యం మనల్ని ఆకట్టుకుంటుంది .అలా ఆకట్టుకునే పాపాయికి ఆ పేరు అంతలా గుర్తుండిపోయింది.గుర్తుండి పోవడం కాదు కచ్చితంగా ఉన్నత మైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు ఇవాళ కలిగిన ఆ స్పందన మార్గం ఏర్పరుస్తుందని నా నమ్మిక ....